ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీగా మార్చిన ఘనత వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి రజినీకే దక్కుతుందని ప్రత్తిపాటి విమర్శించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పదవి వచ్చినప్పటి నుంచి మంత్రి రజిని పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. ఎప్పుడు ఎక్కడ ఉంటారో ఆమెకే తెలియదని, ఈ సారి ఎన్నికలకు ఎక్కడ ఉంటారో కూడా తెలియదని పేర్కొన్నారు. ఆరోగ్యశ్రీలో డబ్బులు తీసుకోకుండా స్టంట్లు వేసిన చరిత్ర ఉంటే చూపించాలంటూ మంత్రికి సవాల్ విసిరారు.