గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా విశాఖ ఉత్తర నియోజకవర్గం 42వార్డు రైల్వే న్యూకోలని కన్నారావు వీధి ప్రాంతంలో విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త, రాష్ట్ర నెడ్ క్యాప్ చైర్మన్ కెకె రాజు 42వార్డు కార్పొరేటర్ ఆళ్ల లీలావతి శ్రీనివాసరావు తో కలిసి సోమవారం పర్యటించారు. ఈ కార్యక్రమంలో బాగంగా ఇంటింటికి వెళ్ళి ఇప్పటివరకు ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ ఫలాలను వివరిస్తూ - ప్రజల సమస్యలు తెలుసుకుంటూ పర్యటించారు.