స్వాతంత్ర్యం కొరకు బ్రిటీషు వారితో పోరాడి ప్రాణాలు వదిలిన అల్లూరి సీతారామరాజు జీవితం స్పూర్తి దాయకమని ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర తెలిపారు. అల్లూరి సీతారామరాజు జయంతి సంధర్బంగా మంగళవారం సాలూరులో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో అల్లూరి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ సంధర్బంగా ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర మాట్లాడుతూ అమాయకులైన గిరిజనులను కూడా పోరాట యోదులుగా తీర్చిదిద్దిన సమర యోదుడు, అతిచిన్న గిరిజన సైన్యంతో బ్రిటీషు వారితో పోరాడి, చిన్నవయస్సులోనే అసువులు బాసిన త్యాగమూర్తి అల్లూరి సీతారాజు జీవిత చరిత్రను మన తరువాతి తరాలకు, యువతకు స్పూర్తిగా అందించాలని తెలిపారు.