నక్కపల్లి మండలంలోని గొడిచెర్ల హైవే జంక్షన్ వద్ద సోమవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మరణించాడు. పాయకరావుపేట మండలం రాజగోపాలపురం గ్రామానికి చెందిన ఉప్పాడ గోవిందరెడ్డి (47) ఒక ఐరన్ షాప్ వద్ద హెల్పర్ గా పనిచేస్తున్నాడని స్థానిక పోలీసులు చెప్పారు. సోమవారం తెల్లవారుజామున బైక్ పై నక్కపల్లి వైపు వస్తుండగా గొడిచెర్ల హైవే జంక్షన్ వద్ద వెనుక నుంచి వేగంగా వస్తున్న కారు బైక్ పై వస్తున్న గోవిందరెడ్డిని ఢీకొట్టింది. దీంతో గోవిందరెడ్డి అక్కడికక్కడే మృతి చెందగా, కారు పంటపొలాల్లోకి దూసుకుపోవడంతో అందులో వున్న బి. దుర్గా ప్రసాద్, ఎ. రాంబాబు గాయపడ్డారు. ఫిర్యాదు మేరకు నక్కపల్లి పోలీసులు కేసు నమోదుచేశారు.