మరో రెండు రోజులు వర్షాలు పడే అవకాశం ఉన్నదని వాతావరణ శాఖ సూచనల మేరకు గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ చేకూరి మంగళవారం అధికారులను అప్రమత్తం చేశారు. గుంటూరు నగరంలో వర్షాల వలన డ్రైన్ లు పొంగే ప్రాంతాల్లో ప్రజారోగ్య కార్మికులు, శానిటేషన్ కార్యదర్శులు, ఇన్స్పెక్టర్లు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి సిబ్బంది అందరూ అందుబాటులో ఉండి. రోడ్ల మీద నిలిచిన నీటిని వెంటనే తొలగించడానికి చర్యలు తీసుకోవాలి. లోతట్టు ప్రాంతాల్లో నిలిచే నీటిని బెయిల్ అవుట్ చేయడానికి ఇంజినీరింగ్ అధికారులు చర్యలు తీసుకోవాలని నగర కమిషనర్ కీర్తి చేకూరి ఆదేశించారు.