గిరి ప్రదక్షిణ విధుల్లో పాల్గొని రైలులో తిరిగి ఇంటికి వెల్తున్న సమయంలో ప్రమాదానికి గురైన ఘటన పాతగోపాలపట్నం వద్ద సొమవారం చోటు చేసుకుంది. గాయపడిన రమేష్ ఏలూరు జిల్లా పెదవేగి పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్‌గా పని చేస్తున్నాడు. గిరిప్రదక్షణలో నైట్ డ్యూటీ చేసి విశాఖ మెయిన్ స్టేషన్లో 6: 40 ట్రైన్ ఎక్కాడు. పాతగోపాలపట్నం వచ్చే సరికి ప్రమాదవశాత్తు పడి పోవడంతో తలకు బలమైన గాయమైంది. దీంతో గోపాలపట్నం పోలీసులు నగరంలో కేర్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం రమేష్ అపస్మారక స్థితి ఉన్నట్లుగా పోలీసులు చెబుతున్నారు.