గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో రోడ్లమీద నిలిచిన నీటిని వెంటనే తొలగించడానికి చర్యలు తీసుకోవాలని గుంటూరు నగర కమిషనర్ కీర్తి చేకూరి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు మంగళవారం ఆమె ఓ ప్రకటన విడుదల చేశారు. రెండు రోజులపాటు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచనల మేరకు ప్రజారోగ్య కార్మికులు, శానిటేషన్ కార్యదర్శులు సిబ్బంది అందరూ అందుబాటులో ఉండి ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని ఆమె సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa