వంగవీటి మోహనరంగా జయంతి వేడుకల్లో జనసేన నేత పోతిన వెంకట మహేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. రంగాను ప్రభుత్వాలు గుర్తు పెట్టుకోక పోయినా ప్రజలు గుండెల్లో పెట్టుకున్నారని అన్నారు. ఆయన స్పూర్తితో సమస్యలపై అనేక మంది పోరాటం చేస్తున్నారని తెలిపారు. రంగా తనయుడు రాధాకృష్ణకు రాజకీయంగా వెన్నుపోటు పొడిచిన జగన్‌కు గుండె పోటు తెప్పించడం ఖాయమన్నారు. నాలుగేళ్లుగా రాధాకృష్ణ రాజకీయ ప్రతీకారం కోసం ఎదురు చూస్తున్నారని తెలిపారు. వంగవీటి మోహనరంగా విగ్రహాలు ఆవిష్కరిస్తూ, సమస్యలపై రాధా అధ్యయనం చేశారన్నారు. తనను మోసం చేసిన వారందరికి రాధాకృష్ణ రాజకీయ సమాధి కడతారని స్పష్టం చేశారు. రంగాకు నిజమైన వారసుడు రాధాకృష్ణ అని అన్నారు. ఆయన చెప్పిన మాట ప్రకారం అందరూ కలిసి నడవాలని సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa