పాదయాత్రలో ఇచ్చిన మాటను నిజం చేస్తూ మూతబడిన చిత్తూరు డెయిరీని అమూల్ సహకారంతో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి పునఃప్రారంభించారని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే శ్రీనివాసులు అన్నారు. దేశంలోనే పేరుగాంచిన చిత్తూరు డెయిరీని తన సొంత లాభం కోసం మూసివేసిన పరమ నీచుడు చంద్రబాబు అని మండిపడ్డారు. అప్పటి డెయిరీ చైర్మన్, చంద్రబాబు బినామీ దొరబాబుతో చిత్తూరు డెయిరీని నష్టాల బాటలో నడిపించేలా చేసి.. డెయిరీని మూయించిన మూర్ఖుడు, జిల్లాకు పట్టిన శని, చరిత్ర హీనుడు చంద్రబాబు అని ఎమ్మెల్యే శ్రీనివాసులు ధ్వజమెత్తారు.