ఆదివాసీల ప్రయోజనాలను కాపాడుతూ సీఎం వైయస్ జగన్ అనేక కార్యక్రమాలను చేపట్టారని, గిరిజనుల కలను ముఖ్యమంత్రి సాకారం చేస్తున్నారని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుబంధ విభాగాల ఇన్చార్జ్, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి అన్నారు. తాడేపల్లిలోని వైయస్ఆర్ సీపీ కేంద్ర కార్యాలయంలో స్వాతంత్య్ర సమరయోధుడు, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్సీలు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, లేళ్ల అప్పిరెడ్డి, డొక్కా మాణిక్యవరప్రసాద్, వరుదు కల్యాణి, పార్టీ నేతలు పాల్గొని అల్లూరి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.