వైయస్ఆర్ సంపూర్ణ పోషణ, వైయస్ఆర్ సంపూర్ణ పోషణ ప్లస్ కింద ఇచ్చే టేక్ హోం రేషన్ సరుకులన్నీ అత్యంత నాణ్యంగా ఉండాలని సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశించారు. ఈ సరుకుల పంపిణీపై మంచి ఎస్‌ఓపీ పాటించాలని అధికారులకు సూచించారు. క్వాలిటీ సర్టిఫికేషన్ తప్పనిసరిగా ఉండాలన్న సీఎం. వైయస్ఆర్ సంపూర్ణ పోషణ కింద 2 కేజీల రాగిపిండి, కేజీ అటుకులు, పావు కిలో బెల్లం, పావుకిలో చిక్కి, పావుకిలో డ్రై ఫ్రూట్స్, 3 కేజీల బియ్యం, కిలో కందిపప్పు, అరకిలో వంటనూనె, 25 కోడి గుడ్లు, 5 లీటర్ల పాలు ఇవ్వాలన్నారు. వైయస్ఆర్ సంపూర్ణ పోషణ ప్లస్ కింద 2 కేజీల రాగిపిండి, కేజీ అటుకులు, అర కిలో బెల్లం, అరకిలో చిక్కి, అరకిలో డ్రై ఫ్రూట్స్, 3 కేజీల బియ్యం, కిలో కందిపప్పు, అరకిలో వంటనూనె, 25 కోడి గుడ్లు, 5 లీటర్ల పాలు ఇవ్వాలన్నారు. సోమవారం తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో మహిళాభివృద్ధి, శిశుసంక్షేమశాఖలపై సీఎం వైయస్.జగన్ నిర్వహించిన సమీక్షలో తెలియజేసారు.