స్వాతంత్య్ర సమరయోధుడు, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పేరుతో ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఒక జిల్లాను ఏర్పాటు చేశారని ఎంపీ విజయసాయిరెడ్డి చెప్పారు. ఆదివాసీల అభ్యున్నతి కోసం వైయస్ జగన్ ప్రభుత్వం అనేక కార్యక్రమాలను అమలు చేస్తోందని చెప్పారు. గిరిజనులకు ఇళ్ల పట్టాలు, వ్యవసాయానికి పోడు భూముల పట్టాలు అందించామన్నారు. అల్లూరి సీతారామరాజు కలను సీఎం వైయస్ జగన్ సాకారం చేస్తున్నారని, ఆదివాసీల హక్కులను అన్ని రకాలుగా ప్రభుత్వం పరిరక్షిస్తుందన్నారు. స్వాతంత్య్ర సమరయోధుడిగా అల్లూరి సీతారామరాజు కారణజన్ముడిగా నిలిచిపోయారన్నారు.