టీడీపీ నేత జేసీ ప్రభాకర్‌రెడ్డి టీడీపీ పాలనలో పోలీసులపై చేసిన దౌర్జన్యాలు అందరికీ తెలుసని వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అన్నారు. సీఐ ఆనందరావు ఆత్మహత్య అంశంలో తాడిపత్రి టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి తీరుపై ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఫైరయ్యారు. సీఐ ఆనందరావు ఆత్మహత్య ను రాజకీయం చేయడం దురదృష్టకరమని చెప్పారు. జేసీ ప్రభాకర్ రెడ్డి శవ రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. ఆత్మహత్యకు అధికార పార్టీ నేతల ఒత్తిడే కారణమని జేసీ ప్రభాకర్ రెడ్డి ఆరోపణలు చేయటాన్ని ఖండిస్తున్నామని చెప్పారు. . సీఐ ఆనందరావు ఆత్మహత్య కేసును పోలీసు ఉన్నతాధికారులు సమగ్రంగా విచారించాలని కోరారు.