మార్కాపురం నియోజక వర్గంలోని టీడీపీ నాయకుల, కార్యకర్తల ఆశీస్సులే తనకు పునర్జన్మను ఇచ్చాయని మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నియోజక వర్గ ఇన్చార్జ్ కందుల నారాయణరెడ్డి పేర్కొన్నారు. స్థానిక జవహర్‌నగర్‌లోని ఆయన నివాసం వద్ద టీడీపీ నియోజకవర్గ స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నారాయణరెడ్డి మాట్లాడుతూ.... తనకు రోడ్డు ప్రమాదం జరిగినప్పటి నుంచి నియోజకవర్గంలోని కార్యకర్తలో కొంత నైరాస్యం నెలకొందన్నారు. తానూ కూడా మళ్లీ తిరిగి వస్తానని అనుకోలేదన్నారు. రానున్న ఎన్నికల్లో వైసీపీని గద్దెదించుకోవడానికి గ్రామస్థాయిలో లక్ష్యాలను నిర్ణయించు కోవాలన్నారు. టీడీపీ ఓటర్లను చేర్చించడం, ప్రతిపక్ష పార్టీ దొంగ ఓట్లను తొలగించడానికి ప్రాధాన్యత ఇవ్వాల న్నారు. రానున్న సాధారణ ఎన్నికల వరకూ ప్రతిక్షణం అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు.