వికాస తరంగిణి మహిళా విభాగం శ్రీకాకుళం ఆధ్వర్యంలో మంగళవారం మహిళలకు ప్రత్యేకంగా ఆరోగ్య శిబిరం ఏర్పాటు చేయబడింది. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ శ్రీకాకుళం జిల్లా శాఖ సహకారంతో రెడ్ క్రాస్ కుట్టు శిక్షణ కేంద్రం నందు మెగా ఆరోగ్య శిబిరం మహిళల కోసం ఏర్పాటు చేయబడింది. ఈ శిబిరంలో మహిళలు ఆరోగ్యంగా ఉండడానికి తీసుకోవలసిన జాగ్రత్తలు, శారీరిక శ్రమ, వ్యక్తిగత పరిశుభ్రత తదితర అంశాలపై అవగాహన కల్పించడం జరిగింది.