అమెరికాలోని ఓరేగాన్ రాష్ట్రంలో కొలంబియా నదిపై ఉన్న ముల్తనోనూ జలపాతం వద్ద విషాద ఘటన వెలుగుచూసింది. 40 ఏళ్ల గెర్రాడో హెర్నాండేజ్ రోడ్రిగ్జ్ అనే వ్యక్తి తన భార్య, ఐదుగురు పిల్లలతో కలిసి జులై 2న జలపాతం చూసేందుకు వెళ్లాడు. అయితే, జలపాతం వద్ద బెన్సన్ బ్రిడ్జి దగ్గర వాకింగ్ చేస్తున్న సమయంలో భార్యాపిల్లల ముందే 150 అడుగుల లోయలో జారి పడిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు అతని మృతదేహాన్ని వెలికితీశారు.