చైనాలో 35 దగ్గర పడుతున్నదంటే చాలు యువతలో భయాందోళనలు మొదలవుతున్నాయి. చేస్తున్న ఉద్యోగం ఎక్కడ ఊడిపోతుందోనని నిద్రలేని రాత్రులు గడుపుతున్నది. ఆ దేశ కంపెనీలు 35 ఏండ్లు దాటిన వారిని ఉద్యోగంలో చేర్చుకునేందుకు నిరాకరిస్తున్నాయి. వారిని వదిలించుకుని నవ యువతను చేర్చుకోవాలనుకుంటున్నాయి. అయితే వీరికి ఎక్కువగా జీతం ఇచ్చే బదులు.. తక్కువ జీతంతో కొత్తవారిని తీసుకోవడానికి సిద్దపడుతున్నారు.