తిరుపతి రుయా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చెల్లదురై(36) అనే రిమాండ్ ఖైదీ మంగళవారం మృతిచెందాడు. తిరుపతి సబ్ జైలు సూపరింటెండెంట్ గురుశేఖర్ రెడ్డి వివరాల మేరకు తమిళనాడు రాష్ట్రం ఆంబూరుకు చెందిన చెల్లదురై తిరుపతిలో యాచకుడిగా జీవిస్తున్నాడు. మద్యం మత్తులో తోటి యాచకులతో గొడవపడి గాయపరిచాడు. అలిపిరి పోలీసులు కేసు నమోదు చేసి తిరుపతి సబ్ జైలుకు పంపించారు. ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతూ మృతిచెందాడు.