ఈనెల 8వ తేదీన ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి అనంతపురం జిల్లా, కల్యాణదుర్గంలో పర్యటించనున్నారు. ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఉషా శ్రీచరణ్, సీఎం ప్రోగ్రాం కోఆర్డినేటర్, ఎమ్మెల్సీ తలశిల రఘురాం పరిశీలించారు. అనంతరం అధికారులతో మంత్రులు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వైయస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి, కాపు రామచంద్రారెడ్డి, వెంకట్రామిరెడ్డి, కలెక్టర్ గౌతమి, ఎస్పీ శ్రీనివాస రావు, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.