బ్రిటన్‌కు చెందిన ఆర్థిక సేవల దిగ్గజం లాయిడ్స్ బ్యాంకింగ్ గ్రూప్ హైదరాబాద్‌లోని తమ నూతన టెక్నాలజీ సెంటర్ ఎండీ, సీఈఓగా తెలుగు మహిళ శిరీషా ఓరుగంటిని నియమించింది. ఈ నెలాఖరులో శిరీషా కంపెనీ బాధ్యతలు చేపట్టనున్నారు. జేసీపెన్సీ ఇండియా ఎండీ, బోర్డు సభ్యురాలిగా పని చేసిన ఆమె లాయిడ్స్ గ్రూప్‌లోని అడుగుపెట్టనున్నారు. అంతకుముందు భారత్‌లోని జేపీ మోర్గాన్ చేజ్ ఎండీగా శిరీష పని చేశారు.