వివాదాస్పద స్వామి నిత్యానంద అత్యాచార ఆరోపణలతో దేశం విడిచి పారిపోయిన విషయం తెలిసిందే. అనంతరం యునైటైడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస పేరుతో ప్రత్యేక దేశాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఈ దేశానికి తన శిష్యురాలైన మాజీ నటి రంజితను ప్రధానమంత్రిగా నియమించుకున్నట్లు ఓ తమిళ పత్రిక తెలిపింది. నిత్యానంద వెబ్ సైట్ లోనూ రంజితను ప్రధానిగా పేర్కొన్నట్లు తెలుస్తోంది. రంజిత పలు తెలుగు, తమిళం, కన్నడ చిత్రాల్లో నటించింది.