ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ త్వరలో ఎన్నికలు జరగాలని ఢిల్లీ వెళ్లి పెద్దల కాళ్లు పట్టుకున్నారని తెలుగుదేశం పార్టీ నేత అచ్చెన్నాయుడు గురువారం విమర్శించారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా టీడీపీ సిద్ధంగా ఉందన్నారు. ఎన్నికల్లో పొత్తులు సహజమని, 2004లో వైఎస్ రాజశేఖరరెడ్డి పొత్తులతో ముందుకు వెళ్లారని గుర్తు చేశారు. రాష్ట్రంలో జగన్ పాలనపై అన్ని వర్గాలు తీవ్ర అసంతృప్తితో ఉన్నాయన్నారు. జగన్ సొంత వర్గంలోనూ తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ విజయం ఖాయమని అన్నారు.టీడీపీ అధికారంలోకి వస్తుందని, చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతారని చాలా సర్వేలు చెబుతున్నాయని అచ్చెన్న అన్నారు.