ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ఇవాళ తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో గృహ నిర్మాణ శాఖపై సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో ఇళ్ల పట్టాల పంపిణీకి భూములు సేకరించాలని అధికారులను ఆదేశించారు. సీఆర్డీఏ పరిధిలో జరుగుతున్న ఇళ్ల నిర్మాణ పనులను అధికారులు సీఎంకు వివరించారు. 5.68,517 ఇళ్లు రూఫ్ లెవల్‌లో ఆపై లెవెల్‌లో నిర్మాణంలో ఉన్నాయని వారు నివేదించారు. ఇప్పటికే కాంట్రాక్టర్ల ఎంపిక పూర్తయిందని అధికారులు తెలిపారు. ఆగస్టు నాటికి 5 లక్షల ఇళ్లను పూర్తి చేస్తామని చెప్పారు. ఈ సందర్భంగా సీఆర్డీఏలో ఇళ్ల నిర్మాణాలపై కోర్టు విచారణ అంశాన్ని సీఎం జగన్‌కు అధికారులు ప్రస్తావించారు. కోర్టు కేసుల కారణంగా ఇళ్ల స్థలాల పంపిణీ నిలిచిపోయిన భూసేకరణపై దృష్టి సారించాలని అధికారులను సీఎం ఆదేశించారు.