నరసరావుపేట పట్టణంలో ఏంజెల్ టాకీస్ వద్ద బాలాజీ ఘీ స్వీట్ షాపును రాష్ట్ర జల వనరుల శాఖ మాత్యులు రాంబాబు, స్థానిక శాసనసభ్యులు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి లు ప్రారంభించారు. శుక్రవారం జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి అంబటి మాట్లాడుతూ మూడు దశాబ్దాల కిందట సత్తెనపల్లి పట్టణంలో మొట్టమొదట ప్రారంభించిన బాలాజీ స్వీట్స్ దుకాణం అంచలంచెలుగా ఎదుగుతూ గుంటూరు పిడుగురాళ్ల నర్సాపేటలో విస్తరించడం అభినందనీయమన్నారు.