కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు శుక్రవారం ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో వీరి సమావేశం జరిగింది. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై కేంద్రమంత్రి ముఖ్యమంత్రితో చర్చించినట్లు తెలుస్తోంది. రిజిజు అధికారిక పర్యటన కోసం ఆంధ్రప్రదేశ్ వచ్చారు. సీఎం జగన్ ఇటీవల ఢిల్లీ వెళ్లారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తదితరులతో ఆయన సమావేశమయ్యారు.