వచ్చే ఎన్నికల్లో వైసీపీ పార్టీ సింగల్ గా పోటీ చేస్తుందని, మరే పార్టీతోనూ పొత్తు పెట్టుకోదని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. గెలవలేమని భయపడే పార్టీలు పొత్తు పెట్టుకుంటాయి అని అన్నారు. సీఎం జగన్ సంక్షేమ పాలనలో ప్రజలంతా సంతోషంగా ఉన్నారని... అభివృద్ధే తమ ఎన్నికల నినాదమన్నారు. పెరిగిన విద్యుత్ చార్జీల పేరుతో కొన్ని సంస్థలు బ్లాక్ మెయిల్ చేస్తున్నాయని ఇది సరికాదన్నారు. వ్యాపారం అయిన తర్వాత లాభనష్టాలు రెండూ ఉంటాయి... లాభాలు వచ్చినప్పుడు కంపెనీలు ప్రభుత్వానికి ఏమైనా ఇచ్చాయా? అని మంత్రి బొత్స ప్రశ్నించారు.