వైఎస్ షర్మిల, తల్లి విజయమ్మ, కుటుంబ సభ్యులు హైదరాబాద్ నుంచి ఇడుపులపాయ చేరుకున్నారు. కడప విమానాశ్రయం నుంచి నేరుగా వేంపల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి చేరుకున్నారు. ఇడుపులపాయలో షర్మిల తన పేరు మీద ఉన్న 9.53 ఎకరాలను తన కుమారుడు రాజా రెడ్డి పేరిట రిజిస్టర్ చేసుకున్నారు. వెంగమునిరెడ్డి నుంచి కొనుగోలు చేసిన 2.12 ఎకరాల భూమిని ఆయన కుమార్తె అంజలిరెడ్డి పేరు మీద రిజిస్టర్ చేశారు. అనంతరం ఎస్టేట్‌కు చేరుకున్నారు.