తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ భవన్లో జరిగిన కార్యక్రమంలో ప్రొద్దుటూరు నియోజకవర్గానికి చెందిన నాయకులు టీడీపీలో చేరారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వారికి పసుపు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీ బలోపేతానికి కృషి చేయాలని, వచ్చే ఎన్నికల్లో విజయం సాధించేందుకు కృషి చేయాలని సూచించారు. ఈ సందర్భంగా చంద్రబాబు తన ప్రసంగంలో పలు రాజకీయ విమర్శలు చేశారు.ఢిల్లీ వెళ్లిన జగన్ ఏం సాధించారో చెప్పాలని నిలదీశారు. ముందస్తు ఎన్నికలని లీకులు ఇచ్చేది వాళ్లేనని, మళ్లీ ఆ వార్తలను ఖండించేది కూడా వాళ్లేనని ఎద్దేవా చేశారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా టీడీపీ సిద్ధంగా ఉందన్నారు. ఎన్నికలు ఎంత త్వరగా వస్తే జగన్ ఇంటికి వెళ్లడం ఛలోక్తులు విసిరారు.