రాష్ట్ర రైతులకు సున్నా వడ్డీకే రుణాలు ఇస్తున్నామన్నరు ఏపీ సీఎం జగన్. అనంతపురం జిల్లా కల్యాణ దుర్గంలో బీమా పరిహారాన్ని జమచేసి అనంతరం ప్రసంగించారు. కరువు వచ్చినా చంద్రబాబు ప్రభుత్వంలో పరిహారం ఇవ్వలేదని మండిపడ్డారు. నాలుగేళ్లలో కోటిన్నర రైతులకు రూ.30 వేల కోట్ల రైతు భరోసా ఇచ్చామని.. పగటిపూట 9 గంటలు నాణ్యమైన ఉచిత విద్యుత్ ఇస్తున్నామన్నారు. 3వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేశామన్నారు.