భారీ వర్షాలకు రెండో రోజు అమర్నాథ్ యాత్ర నిలిచిపోయింది. జమ్ము-శ్రీనగర్ రహదారిపై కొండచరియలు విరిగిపడటంతో పహల్గాం, బల్తాల్ మార్గాల్లోనూ యాత్రను నిలిపివేశారు. దీంతో వేలాది మంది భక్తులు బల్తాల్, నున్వాన్ బేస్, భగవతి నగర్ బేస్ క్యాంపుల్లోనే ఉండిపోవాల్సి వచ్చింది. పంచతర్ణి ప్రాంతంలో దాదాపు 1500 మంది యాత్రికులు చిక్కుకుపోయారు. వీరిలో తెలుగు యాత్రికులు 200 మంది వరకు ఉన్నట్లు తెలుస్తోంది.