దేశంలో అద్బుతమైన మౌలిక వసతులు, అద్బుతమైన రోడ్డు ఉంటే.. దేశం అభివృద్ధి చెందినట్లేనని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. వరంగల్లోని ఆర్ట్స్ కాలేజీలో విజయ సంకల్ప సభలో మోడీతో కలిసి మాట్లాడారు. దేశంలో మౌళిక సదుపాయాల కల్పన విషయంలో ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. రూ.లక్షా 10 వేల కోట్లతో తెలంగాణలో జాతీయ రహదారులు నిర్మించామన్నారు. వేదికపై గడ్కరీతో పాటు తమిళిసై, కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఉన్నారు.