ట్రెండింగ్
Epaper    English    தமிழ்

డీఆర్‌డీఓ సైంటిస్ట్‌కు,,,పాకిస్థాన్ హనీ ట్రాప్

international |  Suryaa Desk  | Published : Sat, Jul 08, 2023, 09:32 PM

పాకిస్థాన్ వేసిన వలపు వలకు చిక్కిన ఓ డీఆర్‌డీఓ సైంటిస్ట్.. మన దేశానికి చెందిన రహస్య సమాచారాన్ని వారితో పంచుకున్నారు. అయితే మహారాష్ట్ర పోలీసులకు చెందిన యాంటీ టెర్రరిజయం స్క్వాడ్ - ఏటీఎస్ చేసిన దాడుల్లో ఈ డీఆర్‌డీఓ సైంటిస్ట్‌ను అరెస్ట్ చేశారు. అనంతరం అతడిని విచారణ జరపగా.. అసలు విషయం వెల్లడించాడు. దీంతో ఆ శాస్త్రవేత్తపై కేసు నమోదు చేసిన పోలీసులు అతడిపై ఛార్జిషీట్ సిద్ధం చేశారు. ప్రస్తుతం ఆ సైంటిస్ట్ జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నాడు.


పాకిస్థాన్ ఇంటెలిజెన్స్ అధికారులు పక్కా ప్లాన్ ప్రకారం ఈ ఆపరేషన్ నిర్వహించినట్లు తెలుస్తోంది. మహారాష్ట్ర పూణెలోని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ - డీఆర్‌డీఓలో పనిచేసే సైంటిస్ట్‌ ప్రదీప్ కురుల్కర్‌‌ను పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ హనీ ట్రాప్ చేసింది. ఈ వలపు వలలో చిక్కుకున్న ప్రదీప్ కురుల్కర్.. కీలక సమాచారాన్ని పంచుకున్నట్లు గుర్తించారు. డీఆర్‌డీఓ ల్యాబ్‌లలో ఒకదానికి డైరెక్టర్‌గా ఉన్న ప్రదీప్‌ను మహారాష్ట్ర ఏటీఎస్ అధికారులు అరెస్ట్ చేసి గత వారం కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేశారు. ఈ కేసులో విచారణ జరిపిన అధికారులకు సంచలన విషయాలు వెలుగు చూశాయి. జరా దాస్‌ గుప్తా అనే పేరుతో ప్రదీప్ కురుల్కర్‌కు వలపు వల వేసినట్లు అధికారులు గుర్తు చేశారు. జరా దాస్ గుప్తా పేరుతో చేస్తూ ఆమె మాయలో పడిపోయిన.. ప్రదీప్.. భారత రక్షణకు సంబంధించి రహస్య సమాచారాన్ని వారికి అందించినట్లు సమచారం. క్లాసిఫైడ్ డిఫెన్స్ ప్రాజెక్టులోని భారత క్షిపణి వ్యవస్థల గురించి పాకిస్థాన్ ఇంటెలిజెన్స్ అధికారులతో చాట్ చేసినట్లు మహారాష్ట్ర ఏటీఎస్ కోర్టుకు సమర్పించిన ఛార్జీషీట్‌లో పేర్కొంది. గూఢచర్యానికి పాల్పడినందుకు అధికార రహస్యాల చట్టం కింద కురుల్కర్‌ను మే 3 వ తేదీన అరెస్ట్ చేశారు. ప్రదీప్ కురుల్కర్, జరా దాస్ గుప్తాతో వాట్సాప్ ద్వారా సంప్రదించినట్లు తెలుస్తోంది. అందులో చాటింగ్, వాయిస్, వీడియో కాల్స్ చేసినట్లు అధికారులు గుర్తుంచారు.


అయితే ప్రదీప్‌తో పరిచయం చేసుకున్న జురా దాస్ గుప్తా.. తాను సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ అని బ్రిటన్‌లో నివసిస్తున్నట్లు తెలిపింది. ఈ క్రమంలోనే ప్రదీప్‌కు దగ్గరై అతడ్ని ఆకర్షించేందుకు అందమైన, అసభ్యకరమైన ఫోటోలు, వీడియోలను పంపించినట్లు గుర్తించారు. దీంతో వారి ఇద్దరి మధ్య బంధం బలపడిందని తెలిపారు. అయితే జురా దాస్ గుప్తాకు చెందిన ఐపీ అడ్రస్ మాత్రం పాకిస్తాన్‌ నుంచి ఆపరేట్ అయినట్లు గుర్తించామని మహారాష్ట్ర ఏటీఎస్ అధికారులు వెల్లడించారు. బ్రహ్మోస్ లాంచర్, డ్రోన్, యూసీవీ, అగ్ని క్షిపణి లాంచర్, బ్రిడ్జింగ్ సిస్టమ్‌కు సంబంధించిన సున్నితమైన, రహస్య సమాచారాన్ని పొందడానికి పాకిస్తాన్ ఏజెంట్ ప్రయత్నించిందని పేర్కొన్నారు.


జురా దాస్‌ గుప్తాకు లొంగిపోయిన ప్రదీప్ కురుల్కర్.. రహస్య సమాచారాన్ని తన ఫోన్‌లో భద్రపరుచుకుని ఆమెతో పంచుకున్నట్లు గుర్తించారు. ఉపరితలం నుంచి ఉపరితలానికి ప్రయోగించే క్షిపణులు, డ్రోన్లు, బ్రహ్మోస్, అగ్ని క్షిపణి లాంచర్లు వంటి వివిధ ప్రాజెక్టుల గురించి ఆమెకు వివరించాడు. అధికారులు చెప్పిన వివరాల ప్రకారం జూన్ 2022 నుంచి డిసెంబర్ 2022 వరకు ప్రదీప్, జురా దాస్ గుప్తా పరిచయం ఉన్నారు. జురా దాస్ గుప్తా పనులు, వ్యవహార శైలి అనుమానాస్పదంగా ఉందని గుర్తించిన ప్రదీప్ ఈ ఏడాి ఫిబ్రవరిలో ఆమె నంబర్‌ను బ్లాక్ చేశాడు. దీంతో వేరే భారతీయ నంబర్ నుంచి వాట్సాప్ మెసేజ్ చేసిన.. తన నంబర్ ఎందుకు బ్లాక్ చేశారని అడిగింది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com