గంగాధర నెల్లూరు నియోజకవర్గం కార్వేటినగరం మండలం దాసరినత్తంలో టీడీపీ జీడీనెల్లూరు నియోజకవర్గ ఇన్చార్జ్ థామస్ ఆదివారం పర్యటించారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వ పాలనలో అభివృద్ధి శూన్యమని మండిపడ్డారు. దళితులపైన కేసులు పెట్టడంలో డిప్యూటీ సీఎం నారాయణ స్వామి ముందు ఉన్నారని ఆ ఘనత ఆయనదేనని మండిపడ్డారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.