దేశ రాజధాని ఢిల్లీ సహా పరిసర ప్రాంతాల్లో జోరుగా వర్షం కురుస్తోంది. శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకూ 15.3 సెం.మీ వర్షపాతం నమోదైందని అధికారులు తెలిపారు. 1982 నుంచి హస్తినలో ఒక్కరోజులో నమోదైన అత్యధిక వర్షపాతం ఇదేనని వెల్లడించారు. ప్రగతి మైదాన్, నెహ్రూ నగర్, పంచశీల మార్గ్, కల్కాజీ, ఐటీఓ తదితర ప్రాంతాల్లో రహదారులన్నీ జలమయమయ్యాయి. దీంతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.