మహారాష్ట్రలోని ముంబైలో దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సీబీడీ బేలాపూర్ నవీ ముంబై నుంచి గోరేగావ్‌కు వెళ్తున్న బాలింత (20) ఓ ఆటోలోకి ఎక్కింది. ఆరే అటవీ ప్రాంతంలో ఆటోని ఆపి నిందితుడు మహిళను కొట్టి అత్యాచారం చేశాడు. కుట్లు తెగడంతో తీవ్ర రక్తస్రావం అయింది. అనంతరం ఆమెను బెదిరించి అక్కడి నుంచి పారిపోయాడు. ఇంటికి చేరుకున్న బాధితురాలు కుటుంబసభ్యులకు జరిగిన విషయం చెప్పింది. దాంతో పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు.