నిరుపేదల కడుపు నింపేందుకు మాజీ సిఎం నారా చంద్రబాబు నాయుడు గతంలో అన్నా క్యాంటీన్ పథకాన్ని తీసుకురావడం జరిగిందని టిడిపి చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని సతీమణి పులివర్తి సుధారెడ్డి అన్నారు. ప్రతి సోమవారం పాకాల సంతలో నిర్వహించే అన్న క్యాంటీన్ ద్వారా రైతులకు, రైతు కూలీలకు, ప్రజలకు భోజన పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.