ఇటీవల మధ్యప్రదేశ్ లోని సిదీలో ఆదివాసీ యువకుడిపై బీజేపీ నేత ఒకరు మూత్రం పోసిన ఘటనకు సంబంధించి వ్యవహారం కీలక మలుపు తిరిగింది. సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ బాధితుడిని స్వయంగా తన నివాసానికి పిలిచి అతని కాళ్లు కడిగి క్షమాపణ కోరిన విషయం తెలిసిందే. అయితే, తాను అసలైన బాధితుడిని కాదని, ఆ వీడియోలో ఉంది తాను కాదని దశమత్ రావత్ పేర్కొన్నారు. నిందితుడు ప్రవేశ్ శుక్లా తనతో బలవంతంగా సంతకం చేయించారని పేర్కొన్నారు.