సైబర్ నేరాలు ఇటీవల కాలంలో విపరీతంగా పెరుగుతున్నాయి. ఇదే కోవలో 'ప్రాడియో' అనే సైబర్ సెక్యూరిటీ సంస్థ తాజాగా సంచలన విషయం వెల్లడించింది. ఫైల్ మేనేజర్, ఫైల్ రికవరీ అండ్ డేటా రికవరీ అనే యాప్స్ యూజర్ల డేటాను చోరీ చేస్తున్నట్లు పేర్కొంది. ఈ రెండింటినీ చైనాకు చెందిన వాంగ్ టామ్ అనే డెవలపర్ డిజైన్ చేసినట్లు వివరించింది. 10 లక్షల కంటే ఎక్కువ మంది వీటిని వాడుతున్నారని, వెంటనే డిలీట్ చేయాలని సూచించింది.