భారీ హింసాత్మక ఘటనల మధ్య జరిగిన పశ్చిమ బెంగాల్ పంచాయతీ ఎన్నికల ఫలితాలు నేడు వెలువడనున్నాయి. భారీ భద్రత నడుమ రాష్ట్రవ్యాప్తంగా ఉదయం 8 గంటలకు అధికారులు ఓట్ల లెక్కింపు ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా 6,100కు పైగా పోలింగ్ కేంద్రాల్లో ఈ నెల 8న పోలింగ్ నిర్వహించగా, 80.71 శాతం పోలింగ్ నమోదైంది. కాగా, ఎన్నికల టైంలో రాష్ట్రంలో పెద్ద ఎత్తున హింస చెలరేగింది. ఘర్షణల్లో 40 మందికి పైగా మరణించారు.