భారత నౌకాదళం కోసం అత్యాధునిక రఫేల్ యుద్ధ విమానాలతో పాటు 3 స్కార్పెన్ తరగతికి చెందిన జలాంతర్గాములు కొనుగోలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ఈ నెల 13, 14 తేదీల్లో ప్రధాని నరేంద్ర మోదీ ఫ్రాన్స్ పర్యటన సందర్భంగా దీనికి సంబంధించి ఒప్పంద ప్రకటన వెలువడనున్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. రక్షణ బలగాలు ఇప్పటికే మంత్రిత్వ శాఖకు ప్రతిపాదనలు పంపినట్లు తెలుస్తోంది.