వలంటీర్లపై కామెంట్లు చేసిన పవన్ కల్యాణ్‌పై ఏపీ మహిళా కమిషన్ సీరియస్ అయ్యింది. హ్యూమన్ ట్రాఫికింగ్‌పై పవన్ దగ్గరున్న లెక్కలేంటో పది రోజుల్లో వివరణ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ నోటీసులు జారీ చేశారు. పవన్ కల్యాణ్ కామెంట్లపై మంగళగిరి మహిళా కమిషన్ కార్యాలయంలో చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మకు మహిళా సంఘాలు, గ్రామ, వార్డు సచివాలయాల వలంటీర్లు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు వలంటీర్లపై కామెంట్లు చేసిన పవన్ కల్యాణ్‌కు మహిళా కమిషన్ నోటీసులు జారీచేసింది. మహిళల మిస్సింగ్ వ్యాఖ్యలపై పది రోజుల్లో సమాధానం చెప్పాలని నోటీస్‌లో పేర్కొన్నారు.