ఏపీ అంగన్వాడీ వర్కర్స్ వెల్ఫేర్ యూనియన్ పిలుపు మేరకు అన్ని కలెక్టరేట్ కార్యాలయాల వద్ద 36గంటల నిరసన కార్యక్రమానికి అంగన్వాడీ కార్యకర్తలు ధర్నాకి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా సీఐటీయూ ఆధ్వర్యంలో అంగన్వాడీలు సుమారు 1500 మందికి పైగా కడప జిల్లా పరిషత్ నుంచి కోటిరెడ్డిసర్కిల్, ఎర్రముక్కపల్లె సర్కిల్ మీదుగా కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని అడ్డుకునేందుకు ప్రయత్నించగా పోలీసులకు, అంగన్వాడీ కార్యకర్తలకు వాగ్వాదం జరిగింది.