వాలంటీర్లపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల వ్యవహారంపై జనసేన గుంటూరు జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. తమ అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటల్లో డిబేట్కు తాము సిద్ధమని.. వైసీపి నాయకులు సిద్ధమా అంటూ సవాల్ విసిరారు. నేషనల్ క్రైమ్ బ్యూరో లెక్కల ప్రకారం 2020 సంవత్సరంలో ఫిమేల్ మిస్సింగ్ 7195 మంది అని.. అలాగే 2021 సంవత్సరంలో 12,327 మంది ఆడపిల్లలు మిస్ అయ్యారని తెలిపారు.