వాలంటీర్ల గురించి పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు దురదృష్టకరం అని ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. పవన్ రాజకీయ నేత కాదని, కేవలం సెలబ్రిటీ అని అన్నారు. ఒక దశ, దిశ లేని వ్యక్తి పవన్ కల్యాణ్ అని అభివర్ణించారు. పవన్ కు ఒక విధానం అంటూ లేదని, అన్నీ గాలివాటం మాటలేనని బొత్స విమర్శించారు. అటు, ఏపీ వాలంటీర్లు పవన్ కల్యాణ్ కు లేఖ రాశారు. 'అయ్యా జల్సా రాయుడు గారూ' అంటూ ప్రారంభించి, పవన్ మూడో భార్య అంశాన్ని కూడా ప్రస్తావిస్తూ విమర్శలు గుప్పించారు. హెరిటేజ్ ఐస్ క్రీం తినడం ఆపి వాస్తవాలు గుర్తించాలని పేర్కొన్నారు.