మధ్యప్రదేశ్లోని ఛతర్పూర్కు చెందిన పదో తరగతి విద్యార్థి గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయాడు. మహర్షి విద్యా మందిర్లో 17 ఏళ్ల బాలుడు సార్థక్ టెన్త్ చదువుతున్నాడు. సార్థక్ పాఠశాలకు వెళ్లి ప్రేయర్ సమయంలో అకస్మాత్తుగా నేలపై కుప్పకూలిపోయాడు. పాఠశాల సిబ్బంది వెంటనే అతడిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. అయితే గుండెపోటు వల్ల ఆ బాలుడు అప్పటికే చనిపోయినట్లు వైద్యులు వెల్లడించారు.దీంతో బాలుడి కుటుంబం విషాదంలో మునిగిపోయింది.