ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కారకులు ఎవరో చెప్పండి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jul 12, 2023, 02:15 PM

డిప్యూటీ సీఎం నారాయణస్వామి గంగాధరనెల్లూరు మండలం వీరకనెల్లూరు పంచాయతీలో మంగళవారం గడప గడపకు మనప్రభుత్వం కార్యక్రమంలో అధికారులు, నేతలతో కలిసి డిప్యూటీ సీఎం పర్యటించారు. ఈ సందర్భంలో పేటనత్తంలో స్థానిక వ్యక్తి చిరంజీవినాయుడు మాట్లాడుతూ.. తమకు కారుఉందని చెప్పి రేషన్‌కార్డు తొలగించారన్నారు. అలానే  తమ కుటుంబానికి భూములు ఎక్కువగా ఉన్నాయని ఆన్‌లైన్‌లో రెవెన్యూ రికార్డుల్లో ఉందని చెప్పి తమ రేషన్‌కార్డును తొలగించేశారని రేణుక అన్నారు. తమ కుటుంబానికి ఎకరా తప్ప ఇంకెక్కడా భూములు లేవన్నారు. ఇలా కార్డులు తీసేయడంతో నాలుగేళ్లుగా తాము సంక్షేమ పథకాలు పొందలేకపోయామన్నారు. దీనికి ఎవరు కారణమని  నారాయణ స్వామిని ప్రశ్నించారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com