నగరి ప్రజలకు అందుబాటులో ఉన్న ఏకాంబరకుప్పం రైల్వేస్టేషన్లో కాచిగూడ ఎక్స్ప్రెస్ ఆగనుంది. దీనివల్ల ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులకు, వ్యాపారులకు పలు ప్రయోజనాలు చేకూరతాయి. ఈ రైలు కొవిడ్ కాలం నుంచి ఏకాంబర కుప్పం రైల్వేస్టేషన్లో ఆగడం లేదు. ఈ క్రమంలో ఈనెల 17వతేదీ నుంచి కాచిగూడ ఎక్స్ప్రెస్ ఏకాంబరకుప్పంలో ఆపనున్నట్లు సదరన్ రైల్వే సీనియర్ డివిజనల్ ఆపరేటింగ్ మేనేజర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ స్టేషన్ నుంచి వెళ్లడానికి జూలై 23 నుంచి ఆన్లైన్ రిజర్వేషన్ కూడా అందుబాటులో వుంటుందని మంత్రి రోజా ఓ ప్రకటనలో తెలిపారు.