దేశవ్యాప్తంగా ప్రజాస్వామ్యక వాదులపై పెట్టిన "ఉపా" కేసులను ఎత్తివేయాలని " ఎన్ ఐ ఏ "లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ జులై 15 శనివారం ఉ" 10 గం"లకు విజయవాడ లో జరిగే మహాధర్నాను విజయవంతం చేయాలని కోరుతూ బుధవారం పిడిఎం ఆధ్వర్యంలో నరసరావుపేట బస్టాండ్ సెంటర్లో సంబంధిత కరపత్రం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పిడిఎం జిల్లా కార్యదర్శి జి రామకృష్ణ, పిడిఎం సీనియర్ నాయకులు నల్లపాటి రామారావు, పౌర హక్కుల సంఘం జిల్లా కమిటీ సభ్యులు చికనం చిన్న తదితరులు పాల్గొన్నారు.