నాదెండ్ల మండలం తూబాడు గ్రామ సచివాలయం వద్ద బుధవారం జగనన్న సురక్ష కార్యక్రమం నిర్వహించారు. సర్పంచి కాశీయా, ఎంపీపీ రాణి, జడ్పీటీసీ మస్తాన్ రావు, ఎంపీడీవో జాకీర్ హుస్సేన్, తాసిల్దార్ ఏవి రమణ పాల్గొని 400 మంది లబ్ధిదారులకు ధ్రువపత్రాలను అందజేశారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసమే జగనన్న సురక్ష కార్యక్రమమని, దీనిని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని కోరారు.