కళింగ వైశ్యులు, శిష్ట కరణాలు, శోంది సామాజిక వర్గాలు ఓబీసీలో చేర్చాలని డిమాండ్ తమ వద్ద ఉందని బీజేపీ ఎంపీ జీవీఎల్ అన్నారు. రాష్ట్రంలో బీసీ వర్గీకరణ జరిగిందని... 142 కులాలకు రిజర్వేషన్లు ఉన్నాయని చెప్పారు. రాష్ట్ర జాబితా, కేంద్ర జాబితా వేరు వేరుగా ఉంటాయన్నారు. 103 కులాలకు మాత్రమే ఓబీసీ జాబితాలో ఉన్నాయన్నారు. ఓబీసీ జాబితాలో ఏ కులాలను చేర్చాలంటే సామాజిక న్యాయ శాఖకు, కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపాలని చెప్పారు. కళింగ వైశ్యులు, శిష్ట కరణాలు, శోంది సామాజిక వర్గాలు ఓబీసీలో చేర్చడానికి పార్టీల అతీతంగా కృషి చేస్తానని అన్నారు.